Powered by Blogger.
RSS

.

.

9. సంకిస భరద్వాజ శంకర్

 (1)ఆశగ  తమతమ నాగులు
 దేశపు  జవ్వని జడలుగ దీరగ  ధరణిన్!
కేశవ నీశులు  సంతస
పాశము  నిచ్చిరి వరములు పామును గొలువన్


(2)పెద్దగ నున్నవి జాలక
ముద్దుల మోముకు తగునని ముదితకు నేలన్
పెద్దగు జడలును, ఇంకొక
సాధన మేకద ఉరినిడి చక్కగ చంపన్




 

(3)విప్పిన  మేఘము క్రమ్మెడు
చప్పున విసిరిన తెలుపును  జవ్వని వగరున్
ఇంపగు పూలను తురిమిన
ఒప్పగు హరివి ల్లదియెగ ఒప్పెడి తనువున్
 

(4)కుఱచగు జడలకు మొదలున
పెరిగెడు బుధ్ధట , జడలును పెరిగిన తెలియున్
కఱవగు మేధట, అవునా
అఱయగ నేనన  పడతులు అంబకు  మారుల్

  

(5)గరళము ఫణికిని తలనని
ఎరుగగ పట్టియు  చెలగుట నెరుగుట కాదే
సరియగు వాల్జడ నిడు చ
క్కెర విషముల చిక్కడి పడ కేగను తరమే?

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment