Powered by Blogger.
RSS

.

.

25. జ్యోతి వలబోజు

అష్టవిధ నాయికల జడపద్యాలు:
భరత ముని రచించిన నాట్య శాస్త్రంలో అష్టవిధ నాయికలుగా ఎనిమిది రకాల నాయికలను తెలిపారు. ఈ ఎనిమిది రకాల నాయికలు ప్రేమ, వలపు మొదలైన ఎనిమిది వివిధములైన మానసిక అవస్థలను తెలియజేస్తారు. వీనిని భారతీయ చిత్రకళలోను, సాహిత్యం, శిల్పకళ మరియు శాస్త్రీయ నృత్యాలలో ప్రామాణికంగా పేర్కొన్నారు. వాటిపై పద్యాలు రాస్తే బాగుంటుందని భావిస్తూ.. జడలకు అన్వయిస్తూ...

1. అభిసారిక
కం. జడి వానకు వడగళ్ళకు
జడియక బ్రేమికుని గల్వ జర జర సాగన్,
జడలున్ గాలిలొ యాడగ
జడలే ఫణులుగ గనపడె జనులకు యాహా!

2.ఖండిత
కం. జడలున్న తనను గాదని
గడపెను ప్రియుడామె యింట గత రాత్రంతా!
మెడబట్టుకు నెట్ట వలె, మొ
గుడిని మరగిన జడలేని కులుకుల గత్తెన్!

3. విప్రలబ్ద
కం. కన్నుల్ గాయలు గాచెను
తన్నున్ మరచెన? మగనికి తగిలిర గాంతల్?
వెన్నున్ వంగెను జడలచె
తన్నులె నీకిక మిగిలెను తప్పవు మామా!

4.కలహాంతరిత
కం. పోపో! రాకుము నాకడ
పాపల మరిగెను పతియని పరిపరి యేడ్చెన్!
ఆ పతి జడలను నిమరగ
వాపోయెన్ దా తదుపరి వలపుల తఫనన్!

5. వాసకసజ్జిక:
కం. పడకన జల్లెను పూలను
జడకున్ యల్లెను విరిసిన జాజుల తీవన్!
గడియకు వాకిలి జూచుచు
యెడదన్ మిక్కిలి వగచుచు యేడీ రాడే!

6. ప్రోషిత భర్తృక లేదా ప్రోషిత పతిక:
కం. దూరపు దేశము లేగగ
కారాగారమె దలచుచు కడు దు:ఖమునన్
బారెడు జడలకు పూలను
గోరక జెలులతొ గడపెను ఘోరము గాదే!

7. విరహోత్కంఠిత:
కం. విరహపు వేదన తాపము
పరులకు జెప్పరు పడతులు పడియెడు బాధన్!
విరులను విప్పుచు జడలను
విరబోసికొనుచు విసుగున విలపించునహో!

8. స్వాధీన పతిక లేదా స్వాధీన భర్తృక :
కం. పారాణి కాళ్ళ కద్దును
ఔరా! పతికేమిసిగ్గు యసలే లేదే!
లేరీ పురమున జడలకు
బారెడు పూలను దురిమెడు భర్తలు నిస్సీ!

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

24. నల్లాన్ చక్రవర్తుల కిరణ్

రమణీయంగా బాపూ
రమణల పిలిచిందట జడ: "రండ్రండ్రండోయ్,
కమనీయంగా నా కథ
అమలిన శృంగారరీతి నల్లండయ్యా!

ఇదిగో, బాపూ, రమణా!
పదిలం మీ గుఱుతులన్ని పదచిత్రాలై
ఎద నింపే 'ఖద'లై అవి
గుది గుచ్చిన జడల లాగ గుండెలనూపున్!"

బాపు ఉవాచ:
రెంజెళ్ళ సీతకైనా
రంజించే రాధకైన రసవత్తరమై
కొంజం చాలా బోల్డుగ
వింజామరలయ్యి వీచు వేణులె అందం!

రమణ ఉవాచ:
అమ్మాయిని చూసినపుడు
అమ్మో, భయమేదొ గలుగు నబ్బాయిలలో!
గమ్మున భయపడకుండా
రమ్మన్నట్టు కులుకు జడ రమణి వెనకనే!

బుడుగు ఉవాచ"కందాన్ని" అద్దితే...
ముందుకు నొక జడ, వెనుకను
ఉందింకో జడ, తికమకగుందే, హయ్యో!
ముందుకొ, వెనకకొ నడకెటు?
గందరగోళం, తెలియని గడబిడ జడతో!

 

ఈ అవకాశాన్ని కల్పించిన విబుధులైన పెద్దలకు నమస్సులతో...
- "నచకి"

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

23. బి.ఎస్.ఎస్.ప్రసాద్

పిన్నకు రెండు జడలునూ 
మిన్నగ నోపును పడచుకు మిండుగ నొక్కటి 
వన్నెగ వాల్జడ, పూజడ
కన్నెకు సొగసగు , నందము  కానగ నెంతో
 
ఇంతి కిక జడ కనబడునె ?
కాంతలు కేసము లిడకను   క్రాపులు జెయ్యగ 
సుంతయు బెదరక అందరు
ఇంతులు నుంచగ పిలకలు నిప్పటి దినముల్

కుంకుడు పుల్లను రుద్దగ 
బంక వదల చిక్కుతీసి బడతులు కట్టన్ 
బింకముగ పట్ట సిరులా 
వంకన జడతో కళకళ  వనితకు  వచ్చున్ 

మెడవరకు కేసములునే 
తుదకున్ తరిగిన   నొక సతి తురతుర వెడలీ 
జడ శతకమ్మును  జూడగ
వేడె పతినొక సవరమును వెంటనె తేగా! 

కురులను జార విడి నటన
మురిపము గా జూపు నెమలి ముమ్మాట మగే!
శిరమున కురులే జూలుగ
పెరుగును, సింహం మగదయి పెరగగ. వింతే!

బి.ఎస్.ఎస్ ప్రసాద్

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

22. ఓరుగంటి సుబ్రహ్మణ్య చక్రవర్తి

తొడపాశము చిన్నప్పుడు,
జడపాశము యవ్వనమున జవ్వని చేతన్.
నడి వయసున ధనపాశము,
కడకా యమపాశమింక కర్మలె మిగులున్

జడగంటలు పిరుదులపై
తడిగిటథకథోమటంచు తాళము వేయన్
నడుమూపెడు గడుసరి కనఁ
బడితే తడబడనిఁదొక్క వ్యాసాత్మజుడే!


సుళ్ళే పస గుఱ్ఱానికి,
పెళ్ళే పస యవ్వనమున, పిరుదులు తాకే
జళ్ళే పస ఆడాళ్ళకు,
గుళ్ళే పస తిరుమలేశు గుడి ప్రాంగణమున్

బట్ట తలయున్న పురుషుడు
పట్టుదలగ జడశతకము పారణ చేస్తే
పట్టును మించెడు మెత్తని
జుట్టుమొలుచు నెత్తిమీద జులపాలొచ్చున్

జడశతకము చదవని మను
జుడు మన్మధుడైనగాని జుట్టంతా ఊ
డెడులాగున శపియింతురు
జడసౌందర్యమునెరిగిన జాణలు, సుకవుల్


నా గురించి చెప్పడానికి ప్రత్యేకించి ఏమీ లేదు. 
పేరు: ఓరుగంటి సుబ్రహ్మణ్య చక్రవర్తి.
వృత్తి: సీనియర్ సాఫ్టువేర్ ఆర్కిటెక్ట్. డెల్, మైక్రోసాఫ్ట్ లాంటి పెద్ద కంపెనీలలో పని చేసి తృప్తి లేక ఒక చిన్న కంపెనీలో రోజులు వెళ్ళబుచ్చుతున్నాను. 
ప్రవృత్తి:  సాఫ్టువేర్  రంగంలో వున్న నాలాంటి వారికి ప్రవృత్తులు ఉండవు. ఊపిరి సలపని పని. ఫేసుబుక్ పుణ్యమా అని పద్యాలమీద మక్కువ కలిగి వ్రాయడానికి ప్రయత్నిస్తున్నాను. హైస్కూలు లో చదివే రోజుల్లో "చక్రవర్తి మాట సద్దిమూట" అన్న మకుటంతో కొన్ని పద్యాలు వ్రాసాను. అంతే. 
కోరిక: ఏనాటికైనా సింహాచల శ్రీలక్ష్మీనరసింహస్వామిపై ఒక శతకం వ్రాసి నాతలిదండ్రులకు అంకితం ఇవ్వాలని

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

21. పంతుల సీతాపతిరావు

                పొడవగు జడ యొకటేనా ?
                జడ యందలి పూలు కూడ  చక్కగా మెరెసెన్ !
                అడుగులు  వేసిన తోడనె
                పడతులతోపాటు  జడయు వంకర పోవున్ !             1

                జడ పొట్టిది మెడ పొట్టిది
                జడ వేయగ కురులు పొట్టి చచ్చే దెట్లా ?
                జడ నైతే సవరించెద
                మెడ సవరణ సాధ్య మెటు లొ ? మీరే  చెపుడీ ?           2

                జడ గంటలు ,మెడ గంటలు
                జడ చుట్టూ పూలదండ జటిలంబనుచున్ ,
                జడ సొగసుకు యంద  మవగ  ,
                జడ నల్లక  విరగ బోయు సంస్కృతి పెరిగెన్!             3

                తడ కొట్టీ  జడ కురులను
                ముడి వేయక ద్రౌపదపుడు పూనెను శఫధమ్ !
                జడ యందలి  సౌభాగ్యము
               కడ  వరకూ యుండ వలయు కాంతల కెపుడున్ !       4

               జడ కుచ్చులు సవ రింపగ
               ఎడపడగా  బ్యూటి కేర్లు  ఎదిగెను  కానీ
               సడలిన దేహము తోడుగ,
               జడ రంగుల మార్పులన్ని సహజము కాదా!

పంతుల  సీతా పతి రావు
విశాఖపట్నం

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

20. పంతుల గోపాలకృష్ణ

 (1)
జడశతకమెట్లు వ్రాయుదు
మెడ కడవని కురుచ కురులె మెలతల కెచటన్
కడదాక వెదకి జూచిన
పొడవగు జడలేడ లేవు పోపో వయ్యా

(2)
గొడవలు పడుచును నాతో
పెడమోమై నిలువ నేల? ప్రియతమ, నీ యా
జడ యూగెడు సికతస్థలి
తడిమెడు నాకొంటె చూపు తాళగ లేవే

(3)
బారెడొ, మూరెడొ, జానెడొ
తీరగు జడ పెంచుకొనగ
నారీమణి పడు బాధల
నేరీ ఎఱిగిన పురషుల నెక్కడ జూడన్.

(4)
గడచిన దినముల లోపల
పొడవగు జడ వేసికొనుట పొలతుల ఫేషన్
నడయాడగ వలెను కురులు
పడతుల కీనాడు మోము పయినెల్లెడలన్.

(5)
జడనుండు పొగరు పడతికి
ఉడిగిన జడ తోడ నుడుగు నుధ్ధతి కూడా
జడ తరిగిన ముడి వేయును,
ముడి తోడనె మారి పోవు ముదితల రూపం.



నా పరిచయం-
పంతుల గోపాల కృష్ణ
వయసు 74 సంవత్సరాలు, విశ్రాంత కేంద్ర ప్రభుత్వోద్యోగి. హైదరాబాదు నివాసి.
సెల్ నం, -9490314932.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

19. డా. లక్ష్మీ రాఘవ

తేటగీతి తెలియనిదాన,
కటకము ద్వారా కూడా కందపద్యము కాంచని దాన,
పట్టుదలగా పద్యములు చదవని దాన,
ఎట్టు రాయంగా గలను జడశతకము లోన?

కెనడా వాశము ఆరునెలలు,
కనిపించును ఇక్కడ అందమైన నయాగరా,
కనులు వెతకెను జలతారు జడ కెై,
కనువిందు చేసేవ కేవలము ఫ్రెంచి జడలే!

పట్టుమని పిడికెడు కురుల కుచ్చులే
జట్టుగా బందించే క్లిప్పుల అందాలే
బెట్టుగా ముఖం పై పడే గుప్పెడు బంచులే,
సెట్టు గావించిన కురుల స్టైలులే....

చిక్కు తీసే చెక్క దువ్వెనలు లేవు,
చక్కనెైన మద్య పాపిటీ లేదు,
చెక్కు చెదరని చిక్కని జడలు లేవు,
ముక్కు తాడు లా జడగంటలూ కానరావు..

 నేడెక్కడ మల్లెపూల జడలూ
కుడి ఎడమగా మొగిలిరేకుల కూర్పు
సడి చేసే జడ గంటలూ
వీడి పోయనవి ఆ దృశ్యాల పంటలూ


డా. లక్ష్మి రాఘవ
3-99, Appagaari street, Kurabalakota.Chittoor dist-517350
MAIL-lkamakoti@gmail.com.

Phone- 08571-280673 – in India
Phone—0017652883575—USA
PHONE-001 6477249486-CANADA

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

18. ఎమ్.ఎస్.రామకృష్ణ

ఉయ్యాలవోలె నూగుచు 
వయ్యారపు నడుముపైన వగలను బోవన్‌
సయ్యాటలాడు వాల్జడ 
అయ్యారే! అతివ నడకకందములద్దున్‌!
 

యమపాశము కీచకులకు 
సుమబాణము రమణుడైన సురుచిర పతికిన్‌
రమణీయము సుందరి జడ 
సమభావము గల్గినట్టి సరసులకెల్లన్‌!
 
 
నడుమును పిరుదులు దాటుచు 
మెడ వెనుకనె జారిజారి మెలికలు తిరుగున్‌
పడగెత్తు నాగు రీతిని 
జడవంపుల తరచి తరచి జగతిని చూడన్‌!
  

అలకల పానుపునెక్కను 
సలలితముగ వలపు జూపి సరసములాడన్‌ 
కలహాన కార్యసిద్ధికి 
పలుఘటనల సూత్రధారి పడతికి జడయే!


మెడమీద పూలనాట్యము 
పొడవగు కేశాల కూర్పు ముప్పేటలతో!
పడతికి నింపొన గూర్చెడి 
జడసొంపును పొగడ తరమె జహ్నువుకైనన్‌!!
 
 
 
M.S.Ramakrishna,
H.No.10-10, SBI Colony, Kothapeta,
(Post) Saroornagar,
Hyderabad-500035.

Mobile: 9849619290

స్వీయపరిచయం: ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, స్వాతి, కారవాన్‌, విమెన్స్‌ ఇరా, శంకర్స్ వీక్లీ, వైజ్‌క్రాక్‌, వగైరా పలు ప్రముఖ పత్రికలలో కార్టూనిస్ట్
రామకృష్ణ గా పాఠకులందరికి చిరపరిచితులైన యమ్మెస్ రామకృష్ణ పూర్తి పేరు మునగపాటి శివరామకృష్ణ. కార్టూన్‌రంగం లో అడుగుపెట్టడానికి స్ఫూర్తి గురుదేవులు బాపు గారయితే, పద్యకవిత్వం మీద మక్కువ పెంచుకోవటానికి కారణం పోతన మహాకవి, కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు అంటారు రామకృష్ణ. వీరి తండ్రి గారు ప్రముఖ కవి కీ.శే. మునగపాటి విశ్వనాథ శాస్త్రి గారు. నాన్నగారు వారసత్వంగా అందించిన పద్యకవిత్వం, గేయాలు, రచనల ప్రభావంతో, నేటి సమకాలీన సమాజ స్థితిగతులపై తాను వ్రాసిన వ్యంగ్య-హాస్య పద్యాలతో వివిధ కవిసమ్మేళనాల్లో పాల్గొని ప్రముఖ కవుల ప్రశంసలు పొందుతున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి స్వచ్చందంగా పదవీ విరమణ చేసిన రామకృష్ణ, తనకు ఇష్టమైన కార్టూన్లు, కవిత్వం, మల్టీమీడియాలో  కృషి చేస్తున్నారు.  బాపు గారి చిత్రకళావిన్యాసం, పోతన/పాపయ్యశాస్త్రి గారల పద్యకవిత్వం, అలనాటి క్లాసిక్ సినిమాలు/పాటలు తనకెంతో ఇష్టమంటారు రామకృష్ణ.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

17. రావు తల్లాప్రగడ


1)(మగవాళ్ళు నెలనెలా ఎందుకు క్షవరం చేయించుకుంటున్నారంటే ...)
కం.|| తొడలను కొట్టుచు పోటీ
జడలకు అనుచూ సవాళ్ళు జవ్వనులొసగన్,
గడగడలాడుచు పురుషులు
గొడవలు వద్దని నెలనెల గొరుగింతురుగా!

2) కం.|| జుట్టునెరసినన్ రంగులు,పొట్టిజడలకు -వరములు పొడుగును, పెంచున్!గట్టిఘటికులాడాళ్ళే!బట్టతలమగనికె గుట్టు బట్టబయలయా!!!:)

3) కం.|| ఎటులన్ ఆడించెడివా
రెటులనయిరి, ఆడువారలిలనందున, భో?
అటునిటు జడకదలాడగ
నటులన్ , వారాడువారనబడిరి యేమో!

4) కం.|| జడలకు గంటలు, కట్టిరి
మడమకు గజ్జెల గలగల మగువలు! అంటే,
గడసరి వార్నింగ్ బెల్లని,
విడువని గుండెల గణగణ వినమని తెలుసా?

5) కం.|| కోసిన కాల్చిన తెలియదు,కూసెడు స్పర్శను విషయమె కొరవడు, నైనా,వేసుకు జడమౌ జడనే
మోసుకు తిరుగుట వనితకె మొప్పగు కాదా!




- రావు తల్లాప్రగడ, కాలిఫోర్నియా

Rao Tallapragada
Infoyogi LLC
Tel: 408-850-1700 ext  222
Fax: 408-516-8945

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS