Powered by Blogger.
RSS

.

.

10. చంద్రమౌళి సూర్యనారాయణ



1.

గడుసరి పడతులు ముడులను 
విడుచుచు యెడపెడ కురులను విసరుచు తిరుగున్ 
నడుమున నడిపడి నూగెడు 
జడయే జవ్వనికి ఫణిగ జక్కన గాదే!


2.
అందముగ జడను వేసిన
సుందరి బంధమ్ము వేసె చూపుల తోనే
డెందం బందున యేదో
గందరగోళంబు గలిగి కలవరపెట్టెన్

3.
మెడమీదుగ ముందుకుపడు
జడతో మునిమాపు వేళ జక్కని రూపున్
బడసిన కన్యామణి తాఁ
బుడమిని ముగ్గులను వేయ ముచ్చటగొలిపెన్

4.
వన్నెల యన్నుల  మిన్నలు
తిన్నని వాల్జడను వేసి తిరుగాడంగన్
కన్నులఁ మరల్చ కష్టము
సన్నని నడుమునకటునిటు జడలేయూగన్

5.
హరువగు పరువమున మెఱయు
విరిఁబోఁడి తనరుచుఁ దుఱిమి విరులను జడలో
మురిపెపు నడకల బిరబిర 
తిరుగుచు మురిపించి కలను తెరమరుగయ్యెన్




పేరు : చంద్రమౌళి సూర్యనారాయణ
పుట్టిన తేది : 14-03-1970
ఊరు : యాజలి, గుంటూరు జిల్లా
నివాసము :రాంనగర్ , హైదరాబాద్
ఫోన్ నంబరు : 9292204129
-మెయిల్ :CSNECRC@gmail.com
అడ్రస్సు : 1-6-225, పార్సిగుట్ట రోడ్, రాంనగర్, హైదరాబాద్-20

స్వపరిచయము : 20 సంవత్సరములు భారతీయ వాయు సేనలో పనిచేసి, పిదప గత 7 సంవత్సరాలుగా దక్షిణ మధ్య రైల్వే లో రిజర్వేషన్ క్లర్క్ గా పనిచేయుచున్నాను. మా తండ్రి గారు శ్రీ శేషగిరిరావుగారి ద్వారా పద్య పఠనము అలవడినది. మా అన్నగారు  రామారావు గారి ప్రోద్బలంతో సరదాగా పద్యములు వ్రాసి ఫేసుబుక్కు లో పెట్టేవాడిని. శంకరాభరణం బ్లాగ్ ద్వారా పద్యరచన  బాగా నేర్చుకునే అవకాశం దొరికింది

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment