పొడవగు జడ యొకటేనా ?
జడ యందలి పూలు కూడ చక్కగా మెరెసెన్ !
అడుగులు వేసిన తోడనె
పడతులతోపాటు జడయు వంకర పోవున్ ! 1
జడ పొట్టిది మెడ పొట్టిది
జడ వేయగ కురులు పొట్టి చచ్చే
దెట్లా ?
జడ నైతే సవరించెద
మెడ సవరణ సాధ్య మెటు లొ ? మీరే చెపుడీ ? 2
జడ
గంటలు ,మెడ గంటలు
జడ చుట్టూ పూలదండ జటిలంబనుచున్ ,
జడ
సొగసుకు యంద మవగ ,
జడ
నల్లక విరగ బోయు సంస్కృతి పెరిగెన్! 3
తడ కొట్టీ
జడ కురులను
ముడి వేయక ద్రౌపదపుడు పూనెను శఫధమ్ !
జడ యందలి
సౌభాగ్యము
కడ వరకూ
యుండ వలయు కాంతల కెపుడున్ ! 4
జడ కుచ్చులు సవ రింపగ
ఎడపడగా
బ్యూటి కేర్లు ఎదిగెను కానీ
సడలిన దేహము తోడుగ,
జడ రంగుల మార్పులన్ని సహజము కాదా!
పంతుల
సీతా పతి రావు
విశాఖపట్నం
1 comments:
excellent
Post a Comment