Powered by Blogger.
RSS

.

.

8. బొడ్డు శంకరయ్య

​​
పడుచుదనమందు ప్రీతిగ
డతులు
 జడ న
ల్లి మంచి 
వాసన నిడు గు
ప్పెడు 
మల్లెపూలను ముడిచి
పుడమిన నడయాడుచుంద్రు 
​ముగ్ధత్వముతోన్!

జడయను  చర్నాకోలా
జడిపించుచు భర్త నెపుడు 
​సరసముతోడన్
విడువక నదుపున బె
​ట్టెడు
పడతు
​ల
 
​పెత్తనము
 
​జూ
డ వచ్చును వసుధన్!


వనితలు పెట్టిన బొట్టుయు
కనురెప్పల పైన బూయు కాటుక మరియున్
పెనవేసి జారవిడిచిన
చనుదోయి నలంకరించు జడలందమిడున్!

చడి చేయని భంగిమతో
నొడలుప్పొంగగ నిలబడి నొద్దిక తోడన్
జడ సౌందర్యము జూపుచు
పడవేతురు ముగ్గులోన పతులను జాణల్!


బారెడు జడతో నతివలు
మూరెడు పొడవైన మల్లె పూలు ముడిచియున్
తీరుగ ముస్తాబై శృం
గారముగా చీర గట్టి కనిపింతురుగా!

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment