Powered by Blogger.
RSS

.

.

7. ఓలేటి శ్రీనివాస భాను


(1)
జడయన్న మరుని రూపము
జడ నూపెడి జాణ యన్ని జగముల నూపున్
జడ సొగసు కంద శతమున
వడి తగ్గక వ్రాయుడయ్య వండర్ఫుల్ గా !
(2)
మొగలి పొద పూలరేకులు
నగవులతో నాణ్యమొప్పు నానా కుసుమాల్
మొగమింత చేసికొనుచును
సిగ పాయల జడను దాగి సిగ్గులు పూసెన్
(3)
కుచ్చులు, గంటలు , దండలు
ఎచ్చగు అందాలు విరియ నిచ్చట భువిలో
విచ్చల విడిగా విరివిగ
నిచ్చలు నివసింప సాగె నెచ్చలి జడలో !
(4)
కడసారి కోర్కె ఏమని
అడుగగ ఉరితీయు ముందు అనెనా ముద్దాయ్
"విడి తాడు బదులు సుందరి
జడ తో ఉరి తీయుడయ్య జన్మ తరింపన్"
(5)
పడతులు పోటీ పడుచును
ముడులెన్నో వేయవచ్చు మురిపెము దీరన్
ఎడపక పరిశీలించిన
జడ అందము ముడి కి రాదు జగముల వెదుకన్
.........................................
పరిచయం
పేరు:ఓలేటి శ్రీనివాసభాను
జననం:6-5-1953, పార్వతీపురం
చదువు: ఎం.కామ్ (ఆంధ్రావిశ్వవిద్యాలయం, విశాఖ)
ఉద్యోగం: దక్షిణ మధ్య రైల్వే లో సీనియర్ ట్రాఫిక్ ఇన్స్పెకర్ (రిటైర్డ్)
శ్రీమతి:ఓలేటి శోభ
చిరంజీవులు : ఓలేటి చైతన్య పవన్, చుండూరి హిమబిందు
వ్యాసంగం: 1968 నుంచి .. కథలు, కవితలు, అనువాదాలు, వివిధ పత్రికల్లో ఫీచర్లు. సంగీత,నృత్య రూపకాలు, లలితగీతాలు ఆకాశవాణి, దూరదర్శన్ లో ప్రసారితాలు.
వెలువడిన పుస్తకాలు :పోగ బండి కథలు, కలకండపలుకులు
అచ్చులో ఉన్నవి: చేతవెన్నముద్ద (ఆధ్యాత్మిక కథలు), వెండితెర వరప్రసాదం -ఎల్వీ ప్రసాద్ జీవిత చరిత్ర , అనురాగమూర్తులు -పి. పుల్లయ్య,శాంతకుమారి
పూర్తి చిరునామా
:ఓలేటి శ్రీనివాసభాను,
337-బి , ఫేజ్ 2, జనప్రియ ఆర్కేడియా,
కౌకూర్ (పోస్ట్)
బోలారం చెక్ పోస్ట్ వద్ద ,
సికింద్రాబాద్- 500010
(9440567151)

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment