Powered by Blogger.
RSS

.

.

6. రాంభట్ల వెంకటరాయ శర్మ


 
ఏపుగ పెరిగిన కురులకు
ప్రాపుగ పట్టించి నూనె పరిపరి విధముల్
క్రాపుగ నల్లిన జడతో
చూపరులన్ తిప్పుకొనెడు చోద్యంబిదియే
 
రుసరుస లాడెడు పతికిని
విసుగంతా వెడలగొట్టి ప్రీతిగ పిలువన్
ముసిముసి నవ్వుల తరుణికి
కొస మెరుపై నిల్చు నేది? కోమలి జడయే!!
 
దంపిన కచ్చోరాలకు
సంపెంగపు నూనె కలిపి చక్కగ రాయన్
ఇంపుగ దువ్విన కురులన్
పెంపెసగగ పూలుపెట్టి పేరొప్పంగా!!
 
అర విరిసిన మందారాల్
విర జాజుల పేర్చి కూర్చి విద్యుల్లతగా
పురుషుల చకితుల జేయగ
తరమే జడ సౌరు నెంచ ధాతకు నైనన్!!
 
చిలకల కొలికికి నలకయు
పలుకుల మాధుర్య మొలుకు పడతికి తలుకున్
అలకల మెలికల జిలుగుల
తలకట్టే సొగసు కూర్చు తరుణుల కెపుడున్!!
 
 
 మొదటి పాదంలో అలక అంటే కినుక,మూడొ పాదంలో అలకల అంటే ముంగురులు అని అర్ధం.
 
రాంభట్ల వేంకట రాయ శర్మ.నేను విశాఖపట్నం లో ఆంధ్ర విశ్వకళాపరిషత్ లో తెలుగు విభాగంలో
( U.G.C.J.R,F) PhD చేస్తున్నాను. 
 
నా విద్యార్హతలు : 
 
Msc మైక్రోబయాలజి: ,
                                                                                       
M.A. తెలుగు
                                                                                       
M.A జ్యోతిషం

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment