Powered by Blogger.
RSS

.

.

4. శ్రీనివాస భరద్వాజ కిషోర్

పసికందుకు వేయజడలు
నసపెట్టకయుందరేమి నయమున కురులే
మసలక యుండెడి విధముగ
కొసకొక రబ్బరు బ్యాండే కుదిరిచ చాలున్

యేలజడలు సరిపోదే
వీలుగనొక క్లిప్పువాడ వెంటు్రకలిమడన్
బాలిక కశ్వపువాలమె
స్కూలుకు బోయే సమయము సుళువుగనుండున్

స్వేచ్ఛను కోరువయసు్సన
నిఛ్చతొ వేతురె జడలను  నిముషముకైనా
స్వేఛ్ఛగ కురులను విడువగ
వాంఛించు యువతులకుజడ బంధముగాదే

వనితగ ఇంటను పనులను
పనితనముతొ చేయువేళ బారెడు జడనే
మునిశిగవలె చుట్టునుతన
పనికడ్డుగ రాకయుండ పదిలముగానే

కొలువుకు పోయెడి వేళను
కలియుగ శీకాయ (Shampoo) వాడి కండిషనరుతో
తళతళ మెరయగచేసికు
రులతీర్చొక జడగనల్లి రూపమె మారె్చన్


ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ కళాశాల, చెన్నై ఐఐటీ లలో విద్యాభ్యాసం. 
వృత్తి - 17 సంవత్సరాలు  భారత రక్షణవిభాగం లో శాస్త్రవేత్తగానూ, తరువాత 18 సంవత్సరాలు అమెరికాలో ఐటీ మానాజిమెంట్ లోను. 
 
17 ఏట తమ గరువుగారు మారెళ్ళ కేశవరావుగారి ప్రోత్సాహంతో మోహినీ భస్మాసురనృత్యనాటకాని్న స్వరపరచడంతో మొదలైన సంగీత దర్శకత్వ యాత్ర దక్షయజ్ఞం”, “వసంతరాజీయం”, “నీహారిక”, “బుధ్ధ”, “విఘ్న వినాయక” “శంకరం లోక శంకరంమొదలగు నృత్యనాటకాలకు, “శ్రీవెంకటేశ్వర వైభవం”, “హరవిలాసం”, “త్యాగయ్య”, “ఆది శంకర”, “చాణక్యమొదలగు నాటకాలకు సంగీత దర్శకత్వం వహించడం, కొన్ని వందల పాటలను స్వరబద్ధం చేయడం ద్వారా ఇంకా కొనసాగుతూవుంది.  
 
తెలుగు, హిందీ, ఆంగ్లంలో పాటలు వ్రాయడం, బృందాలతో పాడడం చేస్తూంటారు.  కంప్యూటరు పైన అన్ని భారతీయవాయిద్యాలను వాడి ఎలెక్టరానిక్ ఆర్కెస్టరేషన్ చేస్తూంటారు.  సాహిత్యంపై, ముఖ్యంగా పద్యసాహిత్యంపై మక్కువ చాలా ఎక్కువ.   తెలుగులో చాలా గేయాలు,  స్వేచ్ఛావృత్తాలలో పద్యాలు, అప్పుడప్పుడు వ్యావహారిక భాషలో ఛందోబద్ధమైన పద్యాలు వ్రాస్తుంటారు. 

రచన:  శ్రీనివాస భరద్వాజ కిశోర్ (కిభశ్రీ)
ఫోను నంబరు: +1 850-321-4705
చిరునామా: 6365 San Martin Ct, Tallahassee, FL, 32312.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment