Powered by Blogger.
RSS

.

.

3. డా.అనిల్ మాడుగుల



క్షీరోదధి మథియింపన
పారంబగు సుధ జనించి పడెనో పుడమిన్
గోరంతనదియె జడయై
నారీజన శిరములందు నడయాడె భళీ !                .1 

జడలోమల్లెలు తురిమిన
పడతికినెడబాటులేని పడకసుఖంబుల్
కడతేరకుండ గలుగున్
జడయె వశీకరణశక్తి జలజాక్షులకున్  II               .2


పెను నాగుపాము పోలిక
వనితామణి వెన్నునంటి పరగెడు జడకై  
మునులెందరొ తపము వదలి
కనుసైగల జేసి జనిరి కామాతురులై II                 .3


జగడములాడెడు వేళన్
జగదాంబై జడను జుట్టి శరవేగముగా
పగవారిపైన దాడికి
తెగియించుచు పరుగులాడు స్త్రీ లోకమ్మున్ II        .4

తరుణులకింపును గూర్చెడు
పిరుదులఁ నడయాడునట్టి పెనుజడను గనన్
పరసతిని జూడనొప్పని
పురుషుని చిత్తమ్ము కూడ మోహమునొందున్ II     .5 




కవి పరిచయం : సాహిత్య శిరోమణి, “అవధాని రత్న” డా.మాడుగుల అనిల్ కుమార్, సంస్కృతోపన్యాసకులు & విభాగాధిపతి, శ్రీ వేంకటేశ్వర ప్రాచ్య కళాశాల, తిరుపతి. ఇంత వరకు 14 అవధానాలు తెలుగులోనూ, రెండు అవధానములు సంస్కృతాంధ్రములలోను, మాలిక అంతర్జాల మాస పత్రిక ప్రోత్సాహంతో  రెండు అవధానాలు అంతర్జాలంలోను ఇలా ఇప్పటి వరకు మొత్తం 17 అవధానాలు చేశారు. సంస్కృతాంధ్ర భాషలలో 19  పుస్తకములు వ్రాశారు.   

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment