Powered by Blogger.
RSS

.

.

2. గుండా వెంకట సుబ్బ సహదేవుడు

1.
శ్రీకరుని సత్య కొంగున
నే కారణమున బిగించె నెరుగన్ దరమా?
తా కులికెడు భంగిమలో
నో కరమున నిన్ను బట్టి హొయలొలుక జడా!
2.
మోహిని సుధఁ బంచెడు కో
లాహలమున నీ సొగసుల లాస్యము శివునే
యూహళ్లో తేల్చి మరుల
బాహాటముగఁ గురిపించ బలమీవె జడా!
3.
తరుణీ మణి జీవితమున
మురిసే ప్రతి యంక మందు పొంకము నీవే!
విరులల్లిన నీ హొయలే
సరసమ్మున పతిని దేల్చు సాధనము జడా!
4.
పరిచర్యలఁ జేయు గృహిణి
శిరమున కొప్పై కురచగ సేవింతువుగా!
పరివారమునకు పనులన్
పురమాయించెడు పొలతికి పోసరము జడా!
5.
కోరిన కోర్కెలు దీరగ
గారాముగ పతిని బట్టు గాలము నీవే!
దారికి రాకను నిక్కిన
సోరమ్ముగ వచ్చి కొట్టు చొలకాలు జడా!
( చొలకాలు = బండి నడిపే సమయంలో యెడ్లను తోలే సాఢనం )


గుండా వేంకట సుబ్బ సహదేవుడు,9440903363
                                     బి.టెక్ (సివిల్)
డిప్యూటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరు
నీటి పారుదల శాఖ.
చిరునామ:
4/153-5,నెహ్రూ రోడ్
ప్రొద్దుటూర్ - 516 360
వై. యస్. ఆర్. జిల్లా.

స్వీయ పరిచయం:
జన్మ స్థలం: కర్నూల్ జిల్లా రుద్రవరం గ్రామం మరియు మండలం
తల్లిదండ్రులు: కీ.శే.శ్రీ గుండా వేంకట్రామ సుబ్బయ్య, శ్రీమతి లక్ష్మి నరసమ్మ దంపతులు
20 సం.లుగా నీటి పారుదల శాఖలో పని చేస్తున్నాను.

తెలుగు భాషాభిమానంతో గురువులు కీ.శే. పల్లా వేంకటపతి శ్రేష్టి గారి ప్రోత్సాహముతో 10 వ తరగతి నుంచే పద్యాలు వ్రాయటం అలవడింది.ఆకాశవాణి, కడప ,దూరదర్శన్ మరియు శంకరాభరణం బ్లాగుల్లో సమస్యా పూరణలు తదితరాల్లో పాలు పంచుకోవటం ప్రశంసలు మరియు పురస్కారాలందుకోవటం జరిగింది.  బి.టెక్ చదివే రోజుల్లో ఆకాశవాణి కడప కేంద్రంలో  వారి కథానిక, నాటికలు ప్రసారమయ్యయి.కళాశాలల్లో ఉత్తమ నటునిగా గుర్తింపు.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment