Powered by Blogger.
RSS

.

.

1. గోలి హనుమచ్ఛాస్త్రి

భామకు వెనకను జడయే
పాముగ తానూగుచుండు, పైనను గనగా
చేమంతిబిళ్ళ మెరయుచు
తామణిగా వెలుగుచుండు తరుణీమణికిన్.

ఇమ్ముగ కొమ్మకు జూడగ
నమ్ముము నొక జాతిపూలె నయముగ బూయున్
కొమ్మకు వాల్జడ దురుమగ
కమ్మని పలు జాతి పూలు గంపెడు విరియున్ !


చూడుడు  కృష్ణుని జడనే
చూడుడుమరి రెండు జడల సోయగ ములనే
చూడుడు  పూజడ సొగసును
జూడగ ముడి, కొఫ్ఫు లొప్పి  శోభించు గదా !


ఇంతలు  దురుమగ సిగ చే
మంతులు మల్లెలు గులాబి మందారములన్
బంతులు, సంపెగ పొగడల
నెంతైనను పొగడలేము ఇంతుల జడలన్  !


జడలేక చిన్ని కృష్ణుడు
ముడిపింఛము దూర్చి తాను ముద్దులొలుకునా !
జడలేక శివుడు గంగను
ముడిబెట్టుచు దాని నాపి  మోయంగలడా !





G.H.SASTRY
D.No. 26-31-108
5th lane
A.T. Agraharam
GUNTUR
522004

Cell: 8500222048

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment