Powered by Blogger.
RSS

.

.

13. సుదర్శన్ కుస్మ

బడి కందము విద్యార్థులు
గుడి కందము వరములిచ్చు కులదైవంబున్
మడి కందము ఫలసాయము
జడ కందము మల్లెపూలు సందర్శింపన్


పొడవైన జడను జూపుతు
నడయాడుచు నగవుచు సతి నమ్మిక తోడన్
తడిపొడి మాటలు నుడువుచు
కడు ప్రేమను జూపి పతిని కలవర పెట్టున్


జత గూడగ నెంచి సఖు
​ల​
చతురతతో నూపి వాలు జడతో గొడుచున్​
అతి సుందర రూపముతో
మతి పోగొట్టుదు రతివలు మత్తు కనులతో
 

తలపై నిండుగ కురులను
మలయుచు నుండిన తరుణుల మైకము లోన
​న్
​త​
లరారు జడను జూచుచు
పులకింతురు
పురుషులెల్ల మోహాన్వితులై



పిడికెడు నడుమును గలిగిన
పడతి యొకతి మల్లెపూలు వాసన గుప్పన్
ముడుచు కొనగ జడ యందున
పడుచుదనపు కుర్రకారు పరవశ మొందెన్.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment