Powered by Blogger.
RSS

.

.

12. ఈడూరి శ్రీనివాస్

పొడవగు జడగని పరుగున 
పడతిని పెళ్ళాడి యొకడు పంతము పోయెన్ 
పడిపడి వగచెను గదరా 
ముడివిడి సవరము వరునికి ముంగిట పడగన్

ఉదయపు నడకల యందున 
మదనుని శరముల వదలుచు మరులను గొల్పన్ 
ఎదుటి వనిత జడలెగిరిన 
పదారు మైళ్ళైన పోదు పడతుల వెనకన్

జడయే కొరడా మగనికి 
జడయే అందము నిరతము జవ్వనికందున్      
జడయే బొమ్మట సుతునకు
జడయే పట్టట మహిళకు జగడములందున్

మందపు మేకప్తో కను     
విందగు ఫోటో కలిగిన వనితకు కూడా     
నిండగు జడలేదంటే  
వందల లైకులు రావది వండరు దేవీ  


శెలవడిగెనాదిశేషుడు
తల ఊపెను హరి సరియని తక్షణమందే  
వలపుగ లక్ష్మిని జూసెన్  
పలు వేగమె సిరి తన జడ పానుపు జేసెన్



స్వీయ పరిచయం:

పేరు: ఈడూరి శ్రీనివాస్
చదువు: ఎం.బీ.ఏ.(ఐ.టీ)
వయసు: ఇప్పుడెందుకులెండి
వృత్తి: రిక్రూట్మెంట్ కన్సల్టెంట్ (నైపుణ్య సొల్యూషన్స్)
మొబైల్ నంబర్: 9885277603
కవితలు, ఘజళ్ళు, పాటలూ, పేరడీలూ రాయడం సరదా, అప్పుడప్పుడు కార్టూన్లు గియ్యడం దురద. పబ్లిషర్లకి నేను తెలియదు కాబట్టి వాళ్ళు నా దగ్గరకి రాలేదు, పబ్లిషర్లు నాకు తెలియదు కాబట్టి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు. అంచేత అచ్చైన పుస్తకాలేమీ లేవు. ఆమధ్య ఎప్పుడో దూరదర్శన్లో రెండు సింగిల్ ఎపిసోడ్స్ కి స్క్రిప్ట్ రాసిన అనుభవం ఉంది. ఇదండీ నా ఆత్మ కధ.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment