Powered by Blogger.
RSS

.

.

14. శ్యామ్ పుల్లెల

(1)

శ్రీకారముఁ జుట్టిరి ‘బ్నిం’
ఏకైక కవికి బదులుగ ఈ-గ్రూపులలో  
చేకూర్చి పద్య కవులను
ప్రాకటముగ 'జడ' శతకము వ్రాయించుటకై
(2)
చీరలుఁ గట్టెడి పడతికి
బారెడు జడ సొగసు నిచ్చు, ప్యాంటులుఁ దొడిగే
నారికి ‘పోనీ టైలే’
గ్యారెంటీగా పొసగును, గదరా శ్యామా!
గ్యారెంటీగా పొసగును, గదరా శ్యామా!
(3)
అబ్బో జడ పొడుగనుచున్
తబ్బుబ్బై పెండ్లియాడి, తననెల జీతం
కొబ్బరినూనెకు మరి ‘తల
సబ్బు’లకే చాల కేడ్చె, సరసుడు శ్యామా!
(4)
జడఁ బట్టి లాగఁ జెల్లును
బుడిబుడినడకల చెల్లికి, ప్రోయాలునకున్
పడిపడి పరసతులకుఁ దా
జడ లాగెడివార లుత్త చవటలు శ్యామా!
(5)
సన్నని నడుముకుఁ దోడగు
మిన్నగు లావాటి జడయె, మేలుర రామా!
సన్నని జడకున్ దోడగు
గున్నేనుగు వంటి నడుము, గోలర శ్యామా!

నా వివరాలు:

పేరు: పుల్లెల శ్యామసుందర్

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment