Powered by Blogger.
RSS

.

.

11. టేకుమళ్ళ వెంకటప్పయ్య




1. జడ, పాయలుగా నల్లగ
కడలి తరంగముల వోలె కనబడుచుండున్
జడ కాదది కుసుమాస్త్రము 
జడునైనను ప్రేమలోన జార్చును జడయే!

2. అతివల జడల సొబంగులు
నుతి జేయగ సాధ్యమౌనె  నొరారంగా!
ధృతిమంతుడైన బ్రహ్మకు
మతి పోవదె జడలు జూడ మరు నిముషమునన్

3. జడలో మల్లెలు విరియగ
జడకుచ్చులు మెరిసిపోవ జవరాలపుడున్
పడకల గదికే జేరగ
పడిపోవడె యెవ్వడైన పడతుల వలలో.

4. పడతులు హొయలొలికించుచు
జడనిరువైపుల ధరియించి సాగుచు పోగా
పడి పడి లొట్టలు వేయుచు
నడయాడెడి యందమనరె నలుగురు యపుడున్.

5. జడలల్లుట నొక కళ యగు
జడలల్లరె నృత్యరీతి  చాతుర్యముతో
జడలే స్త్రీలకు అందము
జడలల్లరె మల్లె జాజి చామంతులతోన్.



పేరు:  టేకుమళ్ళ వెంకటప్పయ్య
ఎడ్రసు:  ఎఫ్-2, అయోధ్యా బిల్డింగ్సు
శివ కామేశ్వరీ దేవాలయం ప్రక్కన
అయోధ్య నగరు
గాంధీ నగరు పోస్టాఫీసు
విజయవాడ- 520 003.


స్తిరవాణి:  0866 2534900
చరవాణి:   9490400858, 9440 191 192

పరిచయం:  10 లైన్లు రాసుకునేందుకు ఏమీ లేదు..  తెలుగంటే అభిమానం, ఆంధ్రా సిమెంట్ కంపెనీలో  మేనేజర్.
పద్యాలూ..కవితలూ.. వ్యాసాలూ రాస్తూ ఉంటాను.. ప్రచురితాలకంటే... అప్రచురితాలే ఎక్కువ..  విజయవాడ  ఎక్స్.రే సాహితీ సంస్థ ద్వారా నెల నెలా కవితా వ్యవసాయం ఉంది. పద్యమంజూష అనే బ్లాగు ద్వారా పద్యాల్ని సులభంగా రాయడం ఎలా? అని రాస్తూ ఉంటాను. ఆధ్యాత్మిక, జ్యోతిష వ్యాసాలూ ప్రచురితం.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment