Powered by Blogger.
RSS

.

.

20. పంతుల గోపాలకృష్ణ

 (1)
జడశతకమెట్లు వ్రాయుదు
మెడ కడవని కురుచ కురులె మెలతల కెచటన్
కడదాక వెదకి జూచిన
పొడవగు జడలేడ లేవు పోపో వయ్యా

(2)
గొడవలు పడుచును నాతో
పెడమోమై నిలువ నేల? ప్రియతమ, నీ యా
జడ యూగెడు సికతస్థలి
తడిమెడు నాకొంటె చూపు తాళగ లేవే

(3)
బారెడొ, మూరెడొ, జానెడొ
తీరగు జడ పెంచుకొనగ
నారీమణి పడు బాధల
నేరీ ఎఱిగిన పురషుల నెక్కడ జూడన్.

(4)
గడచిన దినముల లోపల
పొడవగు జడ వేసికొనుట పొలతుల ఫేషన్
నడయాడగ వలెను కురులు
పడతుల కీనాడు మోము పయినెల్లెడలన్.

(5)
జడనుండు పొగరు పడతికి
ఉడిగిన జడ తోడ నుడుగు నుధ్ధతి కూడా
జడ తరిగిన ముడి వేయును,
ముడి తోడనె మారి పోవు ముదితల రూపం.



నా పరిచయం-
పంతుల గోపాల కృష్ణ
వయసు 74 సంవత్సరాలు, విశ్రాంత కేంద్ర ప్రభుత్వోద్యోగి. హైదరాబాదు నివాసి.
సెల్ నం, -9490314932.

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment