Powered by Blogger.
RSS

.

.

16. కన్నెగంటి వెంకటయ్య

జడయే బందీఖానా
జడయే స్వేచ్చా హరిణని జగమంతటయున్
జడపై కత్తిని గట్టిరి
వడిగా జూలును విదుల్చు వనితాజాణల్ 


చల్లని చిరుగాలితగిలి
కొల్లగ కొమ్మల చివరన ఘుమఘుమ లాడే
మల్లెలు గజలును పాడెను
పల్లెలు పట్నపు పడతుల పాముజడలకై

బడవడు రావణు లంకన
పుడమిజ కేశాలుదువ్వి పూలుముడవలే !
జడనెయ్యననెను ద్రౌపది
కడుధూర్తుని ఒడలు విరిచి కాడేయందే !

బాపూ చిత్తరువైనా
కాపూ రాజయ్య గీయు కళగల చిత్రాల్
చూపులనాకర్షించవు
చాపుగ సొంపైన పడతి జడలేకుంటే.

తురుమగ గుప్పెడు పువ్వులు
మెరియగ కుప్పెలు ,తళుకుల మేలిమి నగలున్
మరియొక నాగరమిడగా
చిరుజడ వొకటుండ వలెను చెలువముమీరన్

సాహితీమిత్ర కన్నెగంటి వెంకటయ్య.ఎస్.ఎ{తెలుగు}జి.ప.ఉ.పాఠశాల ముదిగొండ.ఖమ్మంజిల్లా.తెలంగాణ,9885657582,జనజీవన రాగంలో...గేయరూపకవిత్వం ,చిగురాకులసవ్వడి చిన్నారుల కవితా సంకలనం ప్రచురణలు

  • Digg
  • Del.icio.us
  • StumbleUpon
  • Reddit
  • RSS

0 comments:

Post a Comment